Sunny Leone: ఓటీటీలోకి సన్నీ లియోన్‌ హారర్ మూవీ.. జాగ్రత్తగా ఉండండి అంటూ ప్రముఖ సంస్థ ట్వీట్

బోల్డ్ బ్యూటీ సన్నీ లియోన్(Sunny Leone) ప్రపంచవ్యాప్తంగా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది.

Update: 2024-12-02 14:16 GMT

దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ సన్నీ లియోన్(Sunny Leone) ప్రపంచవ్యాప్తంగా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. సోషల్ మీడియా(Social Media)లో ఆమె ఏ పోస్ట్ పెట్టినా నిమిషాల్లో వైరల్ అవుతుందనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం సన్నీ లియోన్ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఆమె ఇటీవల నటించిన కామెడీ, హారర్ మూవీ ‘మందిర’(Mandira). ఆర్ యువన్(R Yuvan) దర్శకత్వం వహించిన ఈ సినిమా కొమ్మలపాటి శ్రీధర్(Sridhar) సమర్పణలో విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మలపాటి సాయి సుధాకర్(Sai Sudhakar) నిర్మించారు.

ఇందులో యోగిబాబు(Yogi Babu), సతీష్ కీలక పాత్రల్లో కనిపించారు. అయితే ఈ చిత్రం నవంబర్ 22న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. కానీ హిట్ అందుకోలేకపోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘మందిర’(Mandira) సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌(Digital streaming)కు రెడీ అయింది. దీని ఓటీటీ హక్కులు ప్రముఖ సంస్థ ఆహా వీడియో(Aha video) సొంతం చేసుకోగా డిసెంబర్ 05 నుంచి స్ట్రీమింగ్(streaming) అందుబాటులోకి రాబోతున్నట్లు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. అంతేకాకుండా ‘‘సన్నీతో అనుకున్నంత ఫన్నీ కాదు. జాగ్రత్తగా ఉండండి’’ అనే క్యాప్షన్ జత చేసింది.

Tags:    

Similar News