Pushpa-2: సుకుమార్‌కు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది.. రాజమౌళి షాకింగ్ కామెంట్స్

పుష్ప-2(Pushpa-2) డైరెక్టర్ సుకుమార్‌(Sukumar)పై దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) ఫన్నీ కామెంట్స్ చేశారు.

Update: 2024-12-02 16:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: పుష్ప-2(Pushpa-2) డైరెక్టర్ సుకుమార్‌(Sukumar)పై దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) ఫన్నీ కామెంట్స్ చేశారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌(Yusufguda Police Ground)లో జరిగిన పుష్ప-2 ప్రీరిలీజ్ ఫంక్షన్‌కు రాజమౌళి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘విడుదలకు ముందు ఏ సినిమాకైనా ప్రమోషన్స్ ఎలా చేయాలి.. సినిమాను ఆడియన్స్‌లోకి ఎలా తీసుకెళ్లాలి అని చాలా కష్టపడుతుంటారు. కానీ పుష్ప-2 సినిమాకు ఆ అవసరం లేదు. ఆల్రెడీ ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్(Telugu fans) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని చోట్ల టికెట్లు కూడా రికార్డు స్థాయిలో అమ్మడవుతున్నాయి’ అని రాజమౌళి అన్నారు.

ఇదే క్రమంలో సినిమాలోని కొన్ని సీన్స్ గురించి చెబుతూ.. ‘సుక్కుకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. నేను ఎక్కడ సినిమాలోని సీన్స్ లీక్ చేస్తానో అని’ అంటూ రాజమౌళి ఫన్నీ కామెంట్స్ చేశారు. దీంతో ఫంక్షన్‌కు హాజరైన అతిథులంతా పగలబడి నవ్వుతారు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Read More...

Pushpa-2: మూడ్రోజుల్లో సినిమా విడుదల.. హైకోర్టుకు చేరిన పుష్ప-2 ఇష్యూ


Tags:    

Similar News