HHVM: ఫస్ట్ టైమ్.. ఇన్‌స్టాలో మూవీ అప్డేట్ ఇచ్చిన పవన్ కల్యాణ్
ఒకవైపు రాజకీయాలు.. మరోవైపు మూవీ షూటింగ్స్‌తో ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఫుల్ బిజీగా ఉన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ఒకవైపు రాజకీయాలు.. మరోవైపు మూవీ షూటింగ్స్‌తో ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఫుల్ బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. ఒప్పుకున్న సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ప్రతిష్టాత్మక చిత్రమైన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అంతేకాదు.. తన సినిమాలకు సంబంధించిన అప్డేట్‌ను పవన్ కల్యాణ్‌ను సోషల్ మీడియా వేదికగా తెలియజేయడం కూడా ఇదే తొలిసారి కావడం గమనార్హం.
‘‘తీవ్రమైన రాజకీయ షెడ్యూల్ తర్వాత చాలా కాలం పాటు పెండింగ్‌లో ఉన్న హరిహర వీరమల్లు(HariHara Veeramallu) సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాను’’ అని ఇన్‌స్టాలో పవన్ కల్యాన్ పేర్కొన్నారు. కాగా, ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. భారీ చిత్రాల నిర్మాత ఏఎమ్ రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.