Cocaine: 2300 కేజీల కొకైన్ పట్టివేత.. దేశ చరిత్రలోనే తొలిసారి..
ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్ (Queensland) తీరంలో భారీగా కొకైన్ (Cocaine) లభ్యమైంది. కొకైన్ స్మగ్లింగ్ జరుగుతుందన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులు.. సుమారు 2300 కిలోల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు.
దిశ, వెబ్ డెస్క్: ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్ (Queensland) తీరంలో భారీగా కొకైన్ (Cocaine) లభ్యమైంది. కొకైన్ స్మగ్లింగ్ జరుగుతుందన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులు.. సుమారు 2300 కిలోల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన కొకైన్ విలువ సుమారు రూ.4 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. కొకైన్ ను తరలిస్తున్న 13 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. కొకైన్ ను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. అరెస్టైన వారిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
క్వీన్స్ లాండ్ లో చాలా పార్టీలు ఈ కొకైన్ కోసం ఎదురు చూస్తున్నాయని, కొకైన్ ను పోలీసులు పట్టుకోవడంతో ఎక్కడివారు అక్కడ సైలెంట్ అయిపోయారని పోలీసులు పేర్కొన్నారు. అరెస్టైన వారిలో ఒకరు కోమంచెరో అవుట్‌లా మోటార్‌సైకిల్ క్లబ్ బ్రిస్బేన్ చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ అని పోలీసులు భావిస్తున్నారు. ఆస్ట్రేలియాలోనే తొలిసారి ఇంత భారీ మొత్తంలో కొకైన్ లభ్యమైంది. నిందితులను నేడు కోర్టుల్లో హాజరు పరిచి రిమాండ్ కు తీసుకోనున్నారు.