నటి శోభిత మృతి పై గచ్చిబౌలి పీఎస్ లో ఫిర్యాదు..

కన్నడ సీరియల్ నటి శోభిత (32) ఆత్మహత్య కేసు పై దర్యాప్తు ముమ్మరం చేశారు గచ్చిబౌలి పోలీసులు.

Update: 2024-12-02 07:02 GMT

దిశ, శేరిలింగంపల్లి : కన్నడ సీరియల్ నటి శోభిత (32) ఆత్మహత్య కేసు పై దర్యాప్తు ముమ్మరం చేశారు గచ్చిబౌలి పోలీసులు. ఆదివారం మధ్యాహ్నం శోభిత తన బెడ్రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆమె మృతి పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె భర్త సుధీర్ రెడ్డితో పాటు చుట్టుపక్కల వారిని కూడా విచారించారు. ఇప్పటి వరకు భార్య భర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయినట్లు తెలుస్తుంది. అయితే శోభిత డిప్రెషన్ లో ఆత్మహత్య చేసుకుందా లేక ఇతర కారణాలతో చనిపోయిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు శోభిత భర్త సుధీర్ రెడ్డితో పాటు ఇంటి చుట్టుపక్కల వాళ్ళ స్టేట్మెంట్లను సైతం రికార్డు చేశారు. శోభిత ఆత్మహత్యకు ముందు ఎవరెవరితో మాట్లాడింది అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శోభిత మృతి విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు కర్ణాటక నుండి బయలుదేరి వచ్చారు. ఆమె మృతిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మ్యాట్రిమోనిలో శోభిత ప్రొఫైల్ చూసి సుధీర్ రెడ్డి ఆమెకు మ్యారేజ్ ప్రపోజల్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సుధీర్ రెడ్డిని మ్యారేజ్ చేసుకున్న తర్వాత శోభిత నటనకు దూరంగా ఉంటుందని అన్నారు. శోభిత మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.


Similar News