High Court: ఏటూరునాగారం ఎన్ కౌంటర్ పై హైకోర్టులో లంచ్ మోషన్
ఏటూరునాగారం ఎన్ కౌంటర్ పై హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలైంది
దిశ, డైనమిక్ బ్యూరో: ములుగు జిల్లా ఏటూరునాగారం ఎన్ కౌంటర్ (Encounter) పై తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) లంచ్ మోషన్ దాఖలైంది. పౌరహక్కుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. మావోయిస్టుల భోజనంలో విషప్రయోజం జరిగిందని దీనిపై విచారణ జరపాలంటూ పిటిషన్ లో పేర్కొంది. మృతదేహాలకు వైద్య నిపుణుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించాలని, పోస్టుమార్టం సమయంలో వీడియో రికార్డు చేయాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్ ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు హైకోర్టు విచారణ చేపట్టనున్నది. కాగా అదివారం తెల్లవారుజామున కూంబింగ్ చేపట్టిన గ్రేహౌండ్స్ పోలీసులకు మావోయిస్టుల బృందం తారసపడింది. ఈక్రమంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.