Telangana Jagruthi: స్పీడు పెంచిన MLC కవిత..
జైలు నుంచి విడుదలయ్యాక కొన్నాళ్లు మౌనంగా ఉన్న బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత(Kavitha) స్పీడు పెంచారు.
దిశ, వెబ్‌డెస్క్: జైలు నుంచి విడుదలయ్యాక కొన్నాళ్లు మౌనంగా ఉన్న బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత(Kavitha) స్పీడు పెంచారు. బీఆర్ఎస్ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై చేసే కామెంట్లలోనూ పదును పెంచారు. తాజాగా.. ఆమె మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల నేతలతో డిసెంబర్ 4 నుంచి తెలంగాణ జాగృతి(Telangana Jagruthi) సమీక్షా సమావేశాలు నిర్వహించబోతున్నారు.
కవిత షెడ్యూల్:
డిసెంబర్ 4: వరంగల్ & నిజామాబాద్
డిసెంబర్ 5: కరీంనగర్ & నల్గొండ
డిసెంబర్ 6: రంగారెడ్డి & ఆదిలాబాద్
డిసెంబర్ 7: హైదరాబాద్ & ఖమ్మం
డిసెంబర్ 8: మెదక్ & మహబూబ్‌నగర్