CM's Cup 2024: ఈ నెల 7 నుంచి సీఎం కప్ క్రీడోత్సవాలు.. 8 తేదీలోపే ఆన్‌లైన్‌‌లో రిజిస్ట్రేషన్

తెలంగాణలో ఈ నెల 7 నుంచి జనవరి 2 వరకు సీఎం కప్ -2024 (CM's Cup 2024) క్రీడోత్సవాలు జరుగనున్నాయి.

Update: 2024-12-02 11:53 GMT

దిశ,డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఈ నెల 7 నుంచి జనవరి 2 వరకు సీఎం కప్ -2024 (CM's Cup 2024) క్రీడోత్సవాలు జరుగనున్నాయి. గ్రామీణ ప్రాంత ప్లేయర్ల ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చే లక్ష్యంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) చైర్మన్ శివసేనా రెడ్డి తెలిపారు. ఈ క్రీడోత్సవాల్లో 36 ఈవెంట్స్ మూడు దశల్లో నిర్వహించనున్నట్లు శివసేనా రెడ్డి వెల్లడించారు. ఈ నెల 7, 8 తేదీల్లో గ్రామ పంచాయతీ స్థాయిలో క్రీడా పోటీలు జరగనున్నాయి.

ఈ నెల 7, 8 లోపు ఆన్‌లైన్‌లో cmcup 2024.telangana.gov.inలో పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని క్రీడాకారులకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఇవాళ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. గ్రామీణ క్రీడాకారులు తమ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని తెలంగాణ స్పోర్ట్ అథారిటి తెలిపింది. ఈ నెల 7, 8 తేదీల్లో మొదటగా గ్రామ స్థాయిలో పోటీలు, 10-12 వ తేదీల్లో మండల స్థాయిలో, 16-21 తేదీల్లో జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించనున్నారు. వీటిలో పాల్గొనే ప్లేయర్లు వెబ్‌సైట్‌లో తమ సమాచారాన్ని పొందుపరుచుకోవాలి

Tags:    

Similar News