CM Revanth Reddy : విద్యా, వైద్యమే మా ఎజెండా : సీఎం రేవంత్ రెడ్డి

ప్రజా పాలన విజయోత్సవాల్లో(triumph of public governance) భాగంగా ఆరోగ్యశ్రీ(ArogyaSri) ఉత్సవాలను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సోమవారం ప్రారంభించారు.

Update: 2024-12-02 12:20 GMT

దిశ, వెబ్ డెస్క్ : ప్రజా పాలన విజయోత్సవాల్లో(triumph of public governance) భాగంగా ఆరోగ్యశ్రీ(ArogyaSri) ఉత్సవాలను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సోమవారం ప్రారంభించారు. సోమవారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మార్గ్ లో హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో 213 అంబులెన్స్ లకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం 28 పారామెడికల్, 16 నర్సింగ్ కాలేజీలను, 33 మైత్రి ట్రాన్స్ జెండర్ల క్లినిక్స్ ను సీఎం వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం విద్యా, వైద్యం అని తెలియ జేశారు. వైద్యారోగ్యశాఖ బలోపేతం అయిన రోజే ఆరోగ్య తెలంగాణ సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే వైద్యారోగ్యశాఖలో 14 వేల ఉద్యోగాల భర్తీ చేశాం.

'తెలంగాణ ఉద్యమంలో యువత పాల్గొన్నది నియామకాల కోసం మాత్రమే. గత పదేళ్లల్లో నిరుద్యోగుల ఆకాంక్షలను బీఆర్ఎస్ పక్కకు పెట్టింది. ఇచ్చిన నోటిఫికేషన్లు ఇస్తే పేపర్లు లీక్ అయి, జిరాక్స్ సెంటర్లలో తేలితే.. పట్టించుకునే దిక్కు లేకుండా నిరుద్యోగులను వదిలేశారు. వారి ఉద్యోగాలను పీకివేసి, ఆ బాధ్యతలు మా చేతికి ఇచ్చింది యువతనే' అని తెలియ జేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఏ ప్రభుత్వం కూడా ఇంత తక్కువ కాలంలో 50 వేల ఉద్యోగాల భర్తీ చేయలేదని, ఆ ఘనత కేవలం తమకు మాత్రమే దక్కుతుందని పేర్కొన్నారు. యువత, నిరుద్యోగులు స్థిరపడేలా చేసే లక్ష్యంతో అన్ని రకాల పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నామని సీఎం వెల్లడించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఆగిపోయేలా కృత్రిమ ధర్నాలు నిర్వహించి, సుప్రీం కోర్టు దాకా పోయినా కోర్టు వారిని విశ్వసించలేదన్నారు. పదేళ్ళు పాలనలో ఉన్నా ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ వేయకుండా కాలయాపన చేసిన పాపపు పార్టీ బీఆర్ఎస్ అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రూప్ 1, టీచర్ ఉద్యోగ నోటిఫికేషన్లతో సహ అన్ని ఉద్యోగాలకు ప్రక్రియ పూర్తి చేసి నియామక పత్రాలు కూడాఆ ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.  

Tags:    

Similar News