చేవెళ్ల రోడ్డు ప్రమాదానికి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి: పట్లోళ్ల కార్తీక్ రెడ్డి

సోమవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం ఆలూరు స్టేజ్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది.

Update: 2024-12-02 14:03 GMT

దిశ, వెబ్ డెస్క్: సోమవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం ఆలూరు స్టేజ్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న లారీ అదుపు తప్పడంతో రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటున్న వారిపై నుంచి లారీ దూసుకెళ్లి చెట్టును ఢీ కొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంతో ఇప్పటి వరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరో నలుగురి పరిస్థితి విషమంగా మారడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఘటనపై పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కార్తీక్ తన ట్వీట్‌లో "నేను ఆరు నెలల నుంచి మొత్తుకుంటున్నా. ఈరోజు పొద్దుగాల కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పోయిన. ఇప్పుడు మా చేవెళ్లలో మళ్ళీ యాక్సిడెంట్ జరిగింది. కూరగాయలు అమ్ముకునే వ్యక్తుల మీద లారీ దూసుకెళ్లింది. ఎంతమంది చనిపోయినారో..? ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే.. ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి తెలంగాణ ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి" అని రాసుకొచ్చారు.


Similar News