Officials Committee Meeting: విభజన అంశాలపై ఏపీ, తెలంగాణ అధికారుల కమిటీ భేటీ

విభజన అంశాలపై ఏపీ, తెలంగాణ అధికారుల కమిటీ భేటీ అయింది.

Update: 2024-12-02 10:29 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల విభజన అంశాలపై ఉన్నతస్థాయి సమావేశం మొదలైంది. తెలంగాణ సీఎం శాంతికుమారి, ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ నేతృత్వంలోని అధికారుల కమిటీ భేటీ (AP&TG Officials Committee Meeting) అయింది. మంగళగిరిలోని ఏపీఐఐసీ ఆఫీస్ లో ఈ సమావేశం జరిగింది. జరుగుతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విభజన అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ముఖ్యంగా విభజన చట్టంలోని (Bifurcation issues) అపరిష్కృతంగా  ఉన్న 9,10 షెడ్యూల్ లోని సంస్థల ఆస్తుల పంపకాలు, విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల పరస్పర మార్పిడిపై చర్చించినట్లు తెలిసింది. పంపకాలు లేకుండా మిగిలిపోయిన అంశాలపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. వృత్తిపన్ను పంపంకం, ఉమ్మడి సంస్థల ఖర్చులను తిరిగి చెల్లించే అంశాలపై ఇరు రాష్ట్రాల అధికారులు చర్చించినట్లు తెలుస్తున్నది. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలపై ఏపీలో జరుగుతున్న తొలి సమావేశం ఇదే. ఈ ఏడాది జులై 5వ తేదీన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభనజన సమస్యలపై హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి కొనసాగింపుగా ఇవాళ అధికారుల కమిటీ భేటీ అయింది.

Tags:    

Similar News