CM Revanth Reddy : ఇంకో పదేళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది : సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మార్గ్ లో నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవాల్లో(triumph of public governance) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సోమవారం పాల్గొన్నారు.

Update: 2024-12-02 12:52 GMT

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మార్గ్ లో నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవాల్లో(triumph of public governance) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి ఒక్క ఏడాదిలోనే ప్రజలకు ఉపయోగపడేలా అన్ని రంగాల్లో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టామని అన్నారు. విద్యా, ఆరోగ్య రంగాలను బలోపేతం చేసేందుకు.. ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని, పాఠశాలల నిర్వహణ ఏజెన్సీలకు అప్పగించామని, ఆసుపత్రులలో పడకల సంఖ్య పెంచామని, వైద్య శాఖలో ఎన్నడూ లేనంతగా వైద్యుల, నర్సుల నియామకాలు పూర్తి చేశామని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేశామని, వచ్చే సంక్రాంతి తర్వాత రైతు భరోసా(Rythu Bharosa) నిధులు విడుదల చేస్తామని తెలిపారు. సన్నవడ్లు పండిస్తే రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించామని.. రానున్న పదేళ్ళ కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని.. ఈ పదేళ్ళ కాలంలో బోనస్ కొనసాగిస్తామని ప్రకటించారు. ఎవ్వరు ఎంత భయపెట్టినా మీరు సన్నవడ్లు పండించడానికి వెనుకాడాల్సిన పని లేదని దైర్యం చెప్పారు. గత పాలకులు వరి వేస్తే ఉరి అన్నారని, కాని వారి పండిస్తే బోనస్ ఇస్తామని తాము అంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది దేశంలోనే తెలంగాణ రికార్డ్ స్థాయిలో వరి ధాన్యాన్ని పండించిందని వెల్లడించారు. ఉత్సవాలలో భాగంగా.. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మార్గ్ లో హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో 213 అంబులెన్స్ లకు సీఎం పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం 28 పారామెడికల్, 16 నర్సింగ్ కాలేజీలను, 33 మైత్రి ట్రాన్స్ జెండర్ల క్లినిక్స్ ను వర్చువల్ గా ప్రారంభించారు.   

Tags:    

Similar News