Congress MLA: కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు హరీష్ రావు ప్రయత్నం

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు.

Update: 2024-12-02 10:29 GMT
Congress MLA: కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు హరీష్ రావు ప్రయత్నం
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao)కు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Aadi Srinivas) కౌంటర్ ఇచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌(Gandhi Bhavan)లో ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరరావు ఇప్పుడు కూలేశ్వరరావుగా మారిపోయారని సెటైర్ వేశారు. కాంగ్రెస్‌లో చేరేందుకు హరీష్ రావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని కీలక ఆరోపణలు చేశారు. గతంలో కూడా వైఎస్‌(YSR)ను కలిసి పార్టీలో చేరుతానని మొర పెట్టుకున్న విషయాన్ని ఆది శ్రీనివాస్ గుర్తుచేశారు. ఆ సమయంలో హరీష్ రావు తెలివి తెలిసి కేసీఆర్(KCR) దూరం పెట్టారని అన్నారు. అసలు ఫిరాయింపులపై మాట్లాడే హక్కు హరీష్ రావుకు లేనే లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో బీఆర్ఎస్(BRS) సినిమా అయిపోయిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో జరిగిన సమగ్ర కుటుంబ సర్వేతో ఎటువంటి ఉపయోగం లేదని అన్నారు.



 


Tags:    

Similar News