ఈతకు వెళ్లిన యువకుడు తిరిగి రానీ లోకాలకు..

ఈత సరదా ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ సంఘటన సంగారెడ్డి మండల పరిధి కల్పగురు మంజీరా డ్యాంలో చోటుచేసుకుంది.

Update: 2025-03-18 09:41 GMT
ఈతకు వెళ్లిన యువకుడు తిరిగి రానీ లోకాలకు..
  • whatsapp icon

దిశ, సంగారెడ్డి అర్బన్ : ఈత సరదా ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ సంఘటన సంగారెడ్డి మండల పరిధి కల్పగురు మంజీరా డ్యాంలో చోటుచేసుకుంది. సంగారెడ్డి రూరల్ ఎస్సై రవీందర్ తెలిపిన వివరాలు ప్రకారం ఆందోల్ స్వస్థలానికి చెందిన మ్యాతరి నరేష్ (30) కొద్ది కాలంగా తన భార్య దుర్గతో కలిసి ఇస్నాపూర్లో డ్రైవర్ పని చేస్తూ అద్దెకు నివాసం ఉంటున్నాడు. అయితే ఈ నెల 16 ఆదివారం రోజున తన నలుగురు స్నేహితులతో కలిసి మంజీరా డ్యామ్ లో ఈత కోసం అని వెళ్లారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న నరేష్ తోటి స్నేహితులతో కలిసి లోతైన నీటి ప్రవాహం వైపు వెళ్ళగా ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాల్ల సహాయంతో రెండు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం ఉదయం నరేష్ మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.


Similar News