ఆన్లైన్ బెట్టింగ్ కు యువకుడు బలి
పెద్దపల్లి జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్ ఆడి ఓ యువకుడు మృతి చెందాడు. మంథని నియోజకవర్గానికి చెందిన కొరవీణ సాయి తేజ అనే యువకుడు బెట్టింగ్ యాప్ లో డబ్బులు పెట్టి మోసపోయి ఆత్మహత్య చేసుకున్నాడు

దిశ,పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్ ఆడి ఓ యువకుడు మృతి చెందాడు. మంథని నియోజకవర్గానికి చెందిన కొరవీణ సాయి తేజ అనే యువకుడు బెట్టింగ్ యాప్ లో డబ్బులు పెట్టి మోసపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడు గోదావరిఖని అనిల్ డయాగ్నస్టిక్ సెంటర్ లో పని చేస్తున్నాడు. బెట్టింగ్ యాప్ లో డబ్బు పోగొట్టుకొని మనస్తాసానికి గురై గడ్డి మందు తాగి రెండు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కరీంనగర్ ఆసుపత్రికి తీసుకెళ్లగా శుక్రవారం మృతి చెందాడు.