యాదగిరిగుట్టకు వెళ్లిన వివాహిత అదృశ్యం

యాదగిరిగుట్టకు వెళ్లి వస్తానని చెప్పిన వివాహిత అదృశ్యమైన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

Update: 2025-03-21 12:23 GMT
యాదగిరిగుట్టకు వెళ్లిన వివాహిత అదృశ్యం
  • whatsapp icon

దిశ, మేడిపల్లి : యాదగిరిగుట్టకు వెళ్లి వస్తానని చెప్పిన వివాహిత అదృశ్యమైన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పరశురాం 7 సంవత్సరాల క్రితం బోడుప్పల్ కి వలస వచ్చి తన కుటుంబంతో సిద్ది వినాయకనగర్ లో నివాసం ఉంటున్నాడు.

    ఇదే క్రమంలో ఈనెల 19న ఎప్పటిలానే పనికి వెళ్లి తిరిగి ఇంటికి రాగా తన భార్య సౌజన్య (23) కనిపించలేదని, వెంటనే ఫోన్ చేయగా తాను యాదగిరిగుట్ట కు వెళ్లి వస్తానని చెప్పి ఇప్పటి వరకు తిరిగి రాలేదని తెలిపారు. ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వస్తుందని మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో భర్త ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ గోవింద రెడ్డి తెలిపారు. 


Similar News