అలర్ట్: హైదరాబాద్‌లో HoneyTrap ముఠా.. వారితో ఒక్క ఫొటో దిగారంటే ఇక అంతే..!
హైదరాబాద్ కేంద్రంగా హనీట్రాప్ చేసి దోపిడీలకు పాల్పడుతోన్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ కేంద్రంగా హనీట్రాప్ చేసి దోపిడీలకు పాల్పడుతోన్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళతో పాటు మరో తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు సెంట్రల్ జోన్ పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ వెల్లడించారు. 13 మంది కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డ ఈ గ్యాంగ్‌లో ముగ్గురు మహిళలు ఉన్నారని తెలిపారు. ఇందులో ప్రస్తుతం ఓ మహిళ పట్టుబడగా.. మిగిలిన ఇద్దరు మహిళలు పరారీలో ఉన్నారని చెప్పారు. ఈ ముఠాలోని మహిళలు హోమ్ డెలివరీకి వెళ్లి.. మొదట కస్టమర్లకు దగ్గరవుతారు. వారితో క్లోజ్ అయిన అనంతరం కస్టమర్లతో ఫొటోలు దిగుతారు.
ఇక, ఫొటోలు దిగిన మరుసటే రోజే వారి ముఠాతో కలిసి వెళ్లి కస్టమర్ ఇంటి ముందు మహిళ హంగామా చేస్తోంది. ఫొటోలు దిగి ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి కస్టమర్లను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తారు. లేదంటే ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తామని, బంధువులకు పంపుతామని బ్లాక్ మెయిలింగ్‌కు దిగుతారని పోలీసులు తెలిపారు. దీంతో కొందరు ఏం చేయాలో తెలియక.. ఆత్మహత్యలకు పాల్పడటం లేదా ఈ ముఠా అడిగినంత డబ్బు ఇచ్చి మోసపోతున్నారని పోలీసులు వెల్లడించారు. ఇటీవల సౌత్ జోన్ పరిధిలో ఈ తరహా ఫిర్యాదులు 6 అందాయని.. కావున అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు.
Read more:
బెడ్ రూమ్‌లో బోల్డ్ యాంగిల్స్.. పిచ్చెక్కించిన Shama Sikander