మావోయిస్టుల ఘాతుకం.. ఇన్ఫార్మర్ అనే నెపంతో సర్పంచ్ దారుణ హత్య
ఛత్తీస్ గడ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డరు. పోలీస్ ఇన్ఫార్మర్ అనే నెపంతో ఓ గ్రామ సర్పంచ్‌ను దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది.
దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్ గడ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీస్ ఇన్ఫార్మర్ అనే నెపంతో ఓ గ్రామ సర్పంచ్‌ను దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. వివరాల ప్రకారం.. ఛత్తీస్ గడ్‌లోని దంతెవాడ జిల్లా బార్సూర్ హిట్‌మేట గ్రామ సర్పంచ్ రాంథర్ ఆలంగాను ఆదివారం మావోయిస్టులు దారుణంగా హతమార్చారు. అనంతరం అతడి మృతదేహాం వద్ద ఓ లేఖను వదిలి వెళ్లిపోయారు. పోలీసులకు ఇన్ఫార్మర్‌గా పనిచేస్తుండటం వల్ల రాంథర్‌ను శిక్షించినట్లు మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే, కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే ముగ్గురు రాజకీయ నేతలను మావోయిస్టులు హత్య చేయడం దంతెవాడలో సంచలనం సృష్టిస్తోంది. వరుస హత్యలతో రాజకీయ నాయకులు జంకుతున్నారు. దీంతో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లోని రాజకీయ నాయకులకు పోలీసులు బందోబస్తు కట్టుదిట్టం చేశారు.