సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ CI వంశీకృష్ణపై బదిలీ వేటు

హైదరాబాద్ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వంశీకృష్ణపై వేటు పడింది.

Update: 2023-02-10 09:34 GMT

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: హైదరాబాద్ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వంశీకృష్ణపై వేటు పడింది. ఆయనను హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ పోలీస్ కమిషనర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న ఓ మహిళా సబ్ ఇన్స్పెక్టర్‌తో పాటు మిగతా సిబ్బందిని ఆయన కొంతకాలంగా వేధిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వీటిని భరించలేక కొందరు సిబ్బంది పై అధికారులకు తమ గోడును విన్నవించుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయనను హెడ్ క్వార్టర్స్‌కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి.. పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినట్టు సమాచారం. విచారణలో వెలుగు చూసే అంశాలను బట్టి తర్వాతి చర్యలు ఉంటాయని తెలుస్తోంది.

Tags:    

Similar News