వాట్సాప్‌లో వచ్చిన యాప్‌ను డౌన్‌లోడ్ చేస్తే రూ.1.32 కోట్లు మాయం..

వేగంగా ఫిర్యాదు చేశాడు...అరకోటి రూపాయాలను

Update: 2024-12-18 13:47 GMT

దిశ, సిటీ క్రైమ్ : వేగంగా ఫిర్యాదు చేశాడు...అరకోటి రూపాయాలను దక్కించుకున్నాడు. హైదరాబాద్ లో జరిగిన ఓ సైబర్ క్రైం చీటింగ్ ఫిర్యాదు లో చోటు చేసుకున్న ఇది. హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...హైదరాబాద్ కు చెందిన 53 సంవత్సరాల వ్యాపార వేత్తకు వాట్సాప్ లో ట్రేడింగ్ కు సంబంధించిన పిఎంఎల్ ప్రో యాప్ వివరాలు వచ్చాయి. ఆ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని కస్టమర్ సర్వీస్ ను సంప్రదించాడు. వారు మా సలహాలతో మీరు ఐపీఓ అలాట్మెంట్ లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని వివరించారు. వ్యాపారీ నమ్మడంతో అతనిని ట్రాప్ చేసి డబ్బులను పెట్టుబడులుగా పెట్టించడం ప్రారంభించారు.

ఆ తర్వాత అతనికి ఇచ్చిన ఐడిలో విత్ డ్రా ఆప్షన్ ని తీసేశారు. మొత్తం 1.32 కోట్లు కాజేశారు. ఇది మోసమని గుర్తించిన వ్యాపారీ వెంటనే ఎన్ సీ ఆర్ పీ పోర్టల్ లో ఫిర్యాదు చేసి ఆ తర్వాత హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల డిసెంబరు 16 వ తేదీన ఫిర్యాదు అందగానే పోలీసులు వేగంగా స్పందించి సైబర్ చీటర్ మోసగాళ్ల ఖాతాల్లో ఉన్నరూ. 50.87 లక్షలను జప్తు చేశారు. దీంతో బాధితుడికి కొంత ఆర్ధికంగా ఊరట లభించింది. ప్రజలు ఎవరూ కూడా తెలియని ట్రేడింగ్ యాప్ ల ద్వారా వచ్చే పెట్టుబడుల ఆఫర్ లు, ఇంకా గుర్తు తెలియని మాటలకు అధిక లాభాలు వస్తాయని ఆశతో బోల్తా పడొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మోసమని గుర్తించిన వెంటనే ఫిర్యాదు చేస్తే సైబర్ నేరగాళ్ల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళకుండా కట్టడి చేయవచ్చు పోలీసులు తెలిపారు.


Similar News