మ‌ణిపూర్‌ లో మంత్రి గోడౌన్‌కు నిప్పు

మణిపూర్ లో హింసాగ్ని ఇంకా చల్లారలేదు. శుక్రవారం రాత్రి ఇంఫాల్ తూర్పు జిల్లాల్లోని చింగ‌రేల్‌లో రాష్ట్ర ఆహార శాఖ మంత్రి ఎల్ సుసింద్రో కు చెందిన ప్రైవేట్ గోడౌన్‌కు కొంద‌రు నిప్పంటించారు.

Update: 2023-06-24 11:47 GMT

ఇంఫాల్ : మణిపూర్ లో హింసాగ్ని ఇంకా చల్లారలేదు. శుక్రవారం రాత్రి ఇంఫాల్ తూర్పు జిల్లాల్లోని చింగ‌రేల్‌లో రాష్ట్ర ఆహార శాఖ మంత్రి ఎల్ సుసింద్రో కు చెందిన ప్రైవేట్ గోడౌన్‌కు కొంద‌రు నిప్పంటించారు. ఇది పూర్తిగా ద‌గ్ధ‌మైంద‌ని పోలీసులు తెలిపారు. ఇదే జిల్లాలోని ఖురై ప్రాంతంలో ఉన్న మంత్రి సుసింద్రో నివాసానికి కూడా కొంద‌రు నిప్పంటించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే స‌కాలంలో పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళనకారుల ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైంది. మంత్రి నివాసం వద్ద నుంచి ఆందోళ‌న‌కారుల‌ను చెద్ద‌ర‌గొట్టేందుకు పోలీసులు ప‌లుమార్లు భాష్పవాయు గోళాల‌ను ప్రయోగించారు.

ఈ ఘ‌ట‌న‌ల్లో ఎవ‌రికీ ప్రాణ న‌ష్టం వాటిల్ల‌క‌పోవ‌డంతో పోలీసులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. రాష్ట్రంలో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లతో నిరాశ్ర‌యులైన వారికి ఇండ్ల‌ను నిర్మించేందుకు అవ‌స‌ర‌మైన స్ధ‌లాల‌ను మ‌ణిపూర్ సీఎం బీరెన్ సింగ్ ప‌రిశీలించిన కొద్దిసేప‌టికే రాష్ట్ర మంత్రి గోడౌన్‌, నివాసంపై దాడులు జ‌ర‌గ‌డం గమనార్హం.


Tags:    

Similar News