కలెక్టరేట్ ముందు పట్టపగలే భారీ చోరీ

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు ఓ మెస్ లో గురువారం భోజనం చేసి వచ్చే లోపు కారులో ఉన్న మూడు లక్షల అరవై వేల రూపాయల నగదును గుర్తుతెలియని దుండగులు చోరీ చేశారు.

Update: 2024-11-07 15:15 GMT

దిశ, గద్వాల క్రైం : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు ఓ మెస్ లో గురువారం భోజనం చేసి వచ్చే లోపు కారులో ఉన్న మూడు లక్షల అరవై వేల రూపాయల నగదును గుర్తుతెలియని దుండగులు చోరీ చేశారు. పట్టణ ఎస్సై కళ్యాణరావు తెలిపిన వివరాల ప్రకారం అలంపూర్ నియోజకవర్గంలోని ఇమాంపురం గ్రామానికి చెందిన వ్యక్తి పనిమీద కారులో రూ.మూడు లక్షలు తీసుకొని జిల్లా కేంద్రానికి వచ్చాడు.

    కలెక్టర్ ఆఫీస్ ముందున్న భాగ్యలక్ష్మి మెస్ లో భోజనం చేసి వద్దామని కారులో నగదు పెట్టి వెళ్లాడు. భోజనం చేసి వచ్చేలోపు గుర్తు తెలియని వ్యక్తి కారులో ఉన్న మూడు లక్షల అరవై వేల నగదును కాజేశారని గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్ లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. 


Similar News