బ్రేకింగ్ న్యూస్.. గుండె పోటుతో కేసముద్రం తహసీల్దార్ ఫరీదుద్దీన్ మృతి

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో విషాదం నెలకొంది. తహసీల్దార్ ఫరీదొద్దిన్‌కు గుండె పోటుతో మృతి చెందారు.

Update: 2023-04-20 03:02 GMT

దిశ, మహబూబాబాద్ టౌన్: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల తహసీల్దార్ ఫరీదుద్దీన్ (52)బుధవారం రాత్రి మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రిలో గుండెపోటుతో మృతి చెందారు. కేసముద్రం మండల కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో స్థానిక ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ మండల ప్రజాప్రతినిధులతో పాటు హాజరైన తహసీల్దార్ రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన వ్యక్తిగత సిబ్బంది వెంటనే తన కారులో కేసముద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించగా వైద్యుడు తాహసిల్దార్ గుండెపోటుకు గురైనట్లుగా తెలిపాడు. వెంటనే మెరుగైన చికిత్స కోసం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి సిపిఆర్ విధానం ద్వారా చికిత్స చేసి వైద్యం అందిస్తున్న క్రమంలో రాత్రి 10:45 గంటల సమయంలో తహసీల్దార్ మరణించాడు.

తహసిల్దార్ మరణంతో మండల ప్రజలు, ప్రజా ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు తమతో పాటు ఇప్పటివరకు కలిసిమెలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న తాసిల్దార్ క్షణాల్లో మరణించడం జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా తహసీల్దార్ ఫరీదుద్దీన్ ఏడాదిన్నర క్రితం కేసముద్రం మండలానికి ఎమ్మార్వో గా బాధ్యతలు చేపట్టి పేదల పక్షాన నిలబడి అందరిలో మంచి పేరు గుర్తింపును సాధించుకున్నారు. ఎమ్మార్వో ఫరీదుద్దీన్ స్వస్థలం హనుమకొండ కాగా ఇతనికి భార్య ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Tags:    

Similar News