మానవత్వం చాటుకున్న సీఐ సూర్య నాయక్

తమ కుమారుడు చనిపోయి మూడు రోజులైనా, ఇంట్లో దుర్వాసన వస్తున్నప్పటికీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియక అయోమయంలో ఉన్న వృద్ధ దంపతులను నాగోల్ సీఐ సూర్య నాయక్ అక్కన్న చేర్చుకొని మానవత్వం చాటారు.

Update: 2024-10-28 16:35 GMT

దిశ, ఎల్బీనగర్ : తమ కుమారుడు చనిపోయి మూడు రోజులైనా, ఇంట్లో దుర్వాసన వస్తున్నప్పటికీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియక అయోమయంలో ఉన్న వృద్ధ దంపతులను నాగోల్ సీఐ సూర్య నాయక్ అక్కన్న చేర్చుకొని మానవత్వం చాటారు. తమ కుమారుడిని పిలిచినా పలకపోవడంతో మూడు రోజులు ఇంట్లో గుక్కెడు మంచి నీరు, తిండి తిప్పలు లేక అవస్థలు పడ్డ వృద్ధ దంపతులను సీఐ అక్కన్న నేర్చుకోవడంతో పలువురు ప్రశంసల వర్షం కురిపించారు. వివరాల్లోకి వెళితే నాగోల్ డివిజన్ బ్లైండ్స్ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి వృద్ధ దంపతులు రమణ శాంతకుమారి వీరి ఇరువురికి సుమారు 65 సంవత్సరాల పైన ఉంటాయి. వీరికి ఇరువురు కుమారులు పెద్ద కుమారుడు ప్రదీప్ రెండవ కుమారుడు ప్రమోద్, పెద్ద కుమారుడు ప్రదీప్ కు వివాహం జరగగా కుటుంబ సభ్యులతో నగరంలోని ఇతర ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు.

రెండవ కుమారుడైన ప్రమోదుకు వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ప్రమోదును భార్య వదిలి వెళ్ళిపోయింది. భార్య వెళ్లిపోవడంతో మనోవేదనకు గురైన ప్రమోద్ కుమార్ మద్యానికి బానిస అయ్యాడు .మద్యానికి బానిస అయినటువంటి ప్రమోద్ కుమార్ తమ తల్లిదండ్రులు ఇద్దరు కంటి చూపు లేదని వారికి నేను కూడా దూరమైతే ఎన్నో ఇబ్బందుల గురికావాల్సి వస్తుందని ప్రమోద్ కుమార్ తల్లిదండ్రుల వద్దనే ఉంటూ వారి యోగక్షేమాలు చూసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ క్రమంలో గత మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన ప్రమోద్ కుమార్ మృతి చెందాడు. తమ చిన్న కుమారుడు ప్రమోద్ మృతి చెందాడు అన్న విషయం వృద్ధ దంపతులకు తెలియక పోవడంతో పాటు వృద్ధ దంపతులు కొడుకు కోసం పలుమార్లు పిలిచినప్పటికీ అతని నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పాటు ఇంట్లో దుర్వాసన ఎలా వస్తున్న విషయాన్ని కూడా వాళ్లు తెలుసుకోలేకపోయారు.

ఈ క్రమంలో గత మూడు రోజుల నుంచి ఇంట్లో దుర్వాసన వెదజల్లుతూ చుట్టుపక్కల నివాసాలకు వ్యాపించడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి వారు నాగోల్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు . సమాచారం మేరకు నాగోల్ ఇన్స్పెక్టర్ సూర్య నాయక్ ఎస్సై శివ నాగ ప్రసాద్ తో కలిసి దంపతులు నివాసం ఉంటున్నటువంటి ఇంటికి వెళ్లారు. ఆ ఇంట్లో నుండి దుర్వాసన వెదజల్లుతుండడంతో ఆ ఇంటి ముఖద్వారం తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా ప్రమోద్ కుమార్ గత మూడు రోజుల క్రితం చనిపోయి ఉన్నారన్న విషయాన్ని గమనించిన ఇన్స్పెక్టర్ సూర్య నాయక్, ఎస్ఐ శివనగర్ ప్రసాదులు ఈ విషయాన్ని వృద్ధ దంపతులకు తెలియపరిచారు. గత మూడు రోజుల నుంచి ఇంట్లో ఎవరూ లేక తమ కు ఆలన పాలన కరువై కనీసం తాగడానికి కూడా నీరు ఇవ్వలేనటువంటి స్థితిలో తిండి తిప్పలు లేక ఎన్నో అవస్థలకు గురయ్యారు.

వీరి పరిస్థితిని గమనించిన ఇన్స్పెక్టర్ సూర్య నాయక్, ఎస్ఐ శివ నాగ ప్రసాద్ ను వారి ఇరువురిని అక్కున చేర్చుకుని వారికి స్నానం చేయించి, ఆహారం అందించి వారి కన్నీటిని తుడిచారు. తమ కుమారుడు చనిపోయాడు అన్న విషయం కూడా వారు తెలియకపోవడంతో మీ ఇంట్లో చనిపోయిందని ఎవరు అని చెప్పడంతో ఇంట్లో ఉన్నది మా చిన్న కుమారుడు ప్రమోద్ అయి ఉంటాడని వృద్ధ దంపతులు పోలీసులకు తెలియజేశారు .దంపతులు తెలిపిన వివరాల ప్రకారం తన తమ్ముడు ప్రమోద్ కుమార్ చనిపోయిన విషయాన్ని పోలీసులు ప్రదీప్ కుమార్ కు తెలియపరిచారు. ప్రదీప్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగోల్ ఇన్స్పెక్టర్ సూర్య నాయక్ ఎస్ఐ శివ నాగ ప్రసాద్ లు కేసు నమోదు చేసుకొని ప్రమోద్ కుమార్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Similar News