పెట్రోల్ పోసుకుని హోంగార్డ్ ఆత్మహత్యాయత్నం

ఘట్కేసర్ పోలీస్టేషన్లో చర్లపల్లి హోంగార్డ్ మహమ్మద్ గని బుధవారం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Update: 2024-11-27 12:13 GMT

దిశ, ఘట్కేసర్ : ఘట్కేసర్ పోలీస్టేషన్లో చర్లపల్లి హోంగార్డ్ మహమ్మద్ గని బుధవారం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. వివరాల్లోకి వెళ్తే..మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీ ఎదులాబాద్ సర్వేనెంబర్ 258,268 లలో ‌ హోంగార్డు గనికి 30 గుంటల భూమి ఉంది.

    ఈ భూమిని దాయాదులు కబ్జా చేసేందుకు హద్దురాళ్లు తొలగించారు. అయితే వారిపై ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి మూడు రోజులు గడిచినా పట్టించుకోకపోవడంతో బుధవారం పోలీస్ స్టేషన్​కు వచ్చి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. అనంతరం పోలీసులు ఆయనకు కౌన్సెలింగ్ ఇచ్చారు.  


Similar News