50 మంది డాక్టర్లకు నోటీసులు
ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్న సుమారు 50 మంది ప్రభుత్వ డాక్టర్లకు హెల్తక కషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ నోటీసులు జారీ చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ దవాఖానలో డ్యూటీలపై నిర్లక్ష్యం వహిస్తూ, ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్న సుమారు 50 మంది డాక్టర్లకు వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ నోటీసులు జారీ చేశారు. విధుల్లోకి రాకపోయిన అటెండెన్స్ వేసుకోవడం, ఆసుపత్రుల్లో లేకపోవడం వంటి వారికి నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. వీరిపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటామని వైద్యాధికారులు తెలిపారు.
జిల్లా, ఏరియా, ఆసుపత్రుల పనితీరును మెరుగు పరిచేందుకు ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తున్నది. ఈ మేరకు మంత్రి హరీష్, టీవీవీపీ కమిషన్డాక్టర్ అజయ్‌కుమార్ లు ఆకస్మిక తనిఖీలునిర్వహిస్తున్నారు. గత నెల రోజుల్లో ఉమ్మడి మెదక్, మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటించారు. విధులపట్ల నిర్లక్ష్యం వహించినోళ్లకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తున్నది.