శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత..
గుట్టు చప్పుడు విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబట్ట ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.
దిశ, శంషాబాద్: గుట్టు చప్పుడు విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబట్ట ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రియాద్ నుంచి బహ్రెయిన్ మీదుగా గల్ఫ్ ఎయిర్లైన్స్ విమానంలో హైదరాబాద్ వచ్చేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో వచ్చిన ప్రయాణికులను తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ ప్రయాణికుడిపై అనుమానం వచ్చి అతని, లగేజీ బ్యాగును స్కానింగ్ చేయడంతో బ్యాగులో బంగారం ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు.
ప్రయాణికుడు బంగారం 14 బంగారం బిస్కెట్లను చార్జింగ్ బ్యాటరీలో అమర్చుకొని అక్రమంగా తరలిస్తుండగా ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి రూ. 67 లక్షల 96 వేల 133 రూపాయల విలువ జేసే ఒక కిలో 287.6 గ్రాముల 14 బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకొని ప్రయాణికుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.