RMP వైద్యం వికటించి బాలిక మృతి..

RMP వైద్యం వికటించి బాలిక మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

Update: 2024-10-26 12:07 GMT

దిశ, తొర్రూరు:- RMP వైద్యం వికటించి బాలిక మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...సూర్యాపేట జిల్లా,తుంగతుర్తి మండలం,ఏనుగంట తండాలో బానోతు ఐశ్వర్య (15) తండ్రి రమేష్, తొర్రూరు మండలం చౌల్లతండలో తన అమ్మమ్మ దగ్గర ఉంటూ పక్కనే ఉన్న రావులపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటుంది. అయితే పది రోజుల క్రితం నుండి ఐశ్వర్య కు తీవ్రమైన జ్వరం వస్తున్న కారణంగా, ఐశ్వర్యను వెలిశాల గ్రామంలో ప్రథమ చికిత్స సెంటర్లో చూపింంచారు.

కానీ జ్వరం తగ్గక పోయేసరికి శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో కడుపు నొప్పి వస్తుందని,హరిపిరాల గ్రామనికి చెందిన ఆర్ఎంపి డాక్టర్ సారయ్య దగ్గరకు తీసుకెళ్లారు. ఇంజెక్షన్ ఇవ్వడంతో నొప్పి ఎక్కువై, వాంతులు కావడంతో తోర్రుర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. బాలిక అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారని తెలిపారు. మృతదేహాన్ని తొర్రూరు లోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. తండ్రి రమేష్ ఫిర్యాదు మేరకు, ఆర్.ఎం.పి సారయ్య పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు.


Similar News