ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ కిందపడి పోస్ట్ ఆఫీస్ ఉద్యోగి మృతి..

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో సోమవారం ఘోరంగా రోడ్డు

Update: 2025-03-17 07:38 GMT

దిశ,మేళ్లచెరువు : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో సోమవారం ఘోరంగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి అదుపు తప్పి లారీ కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మేళ్లచెరువు మండల కేంద్రంలో మై హోమ్ సిమెంట్ సంబంధించిన లారీ సిమెంట్ లోడ్ తో కోదాడ వైపు వెళ్తుండగా అదే సమయంలో హుజూర్ నగర్ మండలం వేపల సింగారానికి చెందిన పెద్దవరపు అంజి (26) తన ఇంటికి పల్సర్ బైక్ పై వెళ్తున్నారు.

లారీని తన బైక్ పై వెళ్తున్న అంజి ఓవర్ టెక్ చేసే క్రమంలో బైక్ అదుపుతప్పి కింద పడింది. అదే సమయంలో వెళ్తున్న లారీ అంజిపై దూసుకు వెళ్లింది. ప్రమాదంలో అంజి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు అంజి పోస్ట్ ఆఫీస్ ఉద్యోగిగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతనికి ఆరు నెలల క్రితమే వివాహం జరిగిందని సమాచారం. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృత దేహన్ని పోస్టుమార్టం కొరకు హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Similar News