ఏఎస్ఐ ని తుపాకీతో కాల్చి చంపిన కానిస్టేబుల్.. ఛాతిపై 15 బుల్లెట్లు దింపి..
ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్ ముదిపర్‌లోని ఐటీబీపీ 38వ బెటాలియన్ క్యాంప్‌లో ఒక

దిశ,భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్ ముదిపర్‌లోని ఐటీబీపీ 38వ బెటాలియన్ క్యాంప్‌లో ఒక కానిస్టేబుల్ ఇన్సాస్ రైఫిల్‌తో ఏఎస్ఐ ని కాల్చి చంపిన సంఘటన సంచలనం గా మారింది. కవాతు నిర్వహిస్తున్న సమయంలో ఏఎస్‌ఐ మందలించాడన్న కోపంతో కానిస్టేబుల్ కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఏఎస్ఐ కు నుదిటిపై 2 బుల్లెట్లు, ఛాతిపై 15 బుల్లెట్లు దిగగా సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు.
ఖరోరా పోలీస్టేషన్ ముదిపర్‌లోని ఐటీబీపీ 38వ బెటాలియన్ క్యాంప్‌లో ఈ సంఘటన ఉదయం 9 గంటలకు జరిగింది. ఉదయం కవాతు సందర్భంగా ఏఎస్‌ఐ దేవేంద్ర సింగ్ దహియా మందలించాడన్న కోపంతో కానిస్టేబుల్ సరోజ్ కుమార్ కాల్పులు జరిపాడు. సమాచారం అందుకున్న ఖరోరా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనా స్థలంలో ఐటీబీపీ 38 వ బెటాలియన్ సీనియర్ అధికారులు ఉన్నారు.