రోడ్డుపైన పార్కింగ్ చేయడం వల్లనే మా పాప చనిపోయింది

మార్చి 19 న జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 లో జరిగిన కారు యాక్సిడెంట్ కేసు పై జూబ్లీహిల్స్ పోలీసులు వేగం పెంచారు.

Update: 2025-03-21 09:13 GMT
రోడ్డుపైన పార్కింగ్ చేయడం వల్లనే మా పాప చనిపోయింది
  • whatsapp icon

దిశ, శేరిలింగంపల్లి : కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డేపల్లి ఎంక్లేవ్ లో అద్రిత అనే రెండున్నర సంవత్సరాల పాపను కారు ఢీకొట్టడంతో చికిత్స పొందుతూ మృతి చెందిన నేపథ్యంలో తల్లిదండ్రులు స్పందించారు. తమ కమ్యూనిటీలో రోడ్ల పైన పార్కింగ్ చేయవద్దని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన సొసైటీ సభ్యులు కానీ నివాసితులు కానీ పట్టించుకోకుండా కారు పార్క్ చేయడం ద్వారా ఈ ప్రమాదం జరిగి తన కూతురు మృతి చెందిందని పాప తల్లిదండ్రులు అలేఖ్య, శ్రీరామ్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనలో నిందితుడు వెంకటేశ్వరరావును కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఆడుకుంటున్న చిన్నారి పైన కారు ఎక్కించడమే కాకుండా పారిపోయేందుకు ప్రయత్నించాడని, తన కూతురిని కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా చివరికి రక్తం ఎక్కువగా పోవడంతో చనిపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు. తనలాగా మరో కుటుంబానికి జరగకుండా కఠిన శిక్షణ విధించాలని వారు కోరారు.

Similar News