Arrested: ఎక్సైజ్ అధికారుల మెరుపు దాడులు.. 7 కిలోల గంజాయి సీజ్, నలుగురు అరెస్ట్

రాష్ట్రంలో డ్రగ్స్ (Grugs), గంజాయి (Ganja) సమూలంగా నిర్మూలించేందుకు తెలంగాణ సర్కార్ (Telangana Government) పకడ్బందీగా వ్యవహరిస్తుంది.

Update: 2024-10-23 12:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో డ్రగ్స్ (Grugs), గంజాయి (Ganja) సమూలంగా నిర్మూలించేందుకు తెలంగాణ సర్కార్ (Telangana Government) పకడ్బందీగా వ్యవహరిస్తుంది. ఈ మేరకు మత్తు పదార్థాల కేసుల్లో పట్టుబడిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ పోలీసు శాఖ (Police Department)కు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే టాస్క్‌ఫోర్స్ (Taskforce), ఎస్‌వోటీ (SOT), ఇతర పోలీసు సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతూ గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకుని కేసులు నమోదు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad) పరిధిలోని ఎక్సైజ్ అధికారులు (Excise Police) మెరుపు దాడులు చేశారు. ఆ మేరకు 7 కిలోల గంజాయి (Ganja), ఎండీఎంఏ డ్రగ్ (MDMA Drug)ను కూడా సీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నుంచి గంజాయిని అక్రమంగా తీసుకొచ్చి గుట్టచప్పుడు కాకుండా అమ్ముతున్న ధూల్‌పేట్ (Dhoolpet) ప్రాంతానికి చెందిన గీతాబాయ్, శీలాబాయ్, క్రాంతి అనే మహిళలను ఎక్సైజ్ పోలీసులు (Excise Police) అరెస్ట్ చేశారు. అదేవిధంగా బెంగళూరు (Bengaluru) నుంచి ఎండీఎంఏ డ్రగ్స్‌ (MDMA Drug)‌ను అక్రమంగా తీసుకొచ్చి సప్లై చేస్తున్న అజయ్‌ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, హైదరాబాద్‌లో బుక్‌ చేసుకున్న కస్టమర్లకు అతడు నిత్యం డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. 


Similar News