ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్
పంగులూరు మండలం నార్నేవారిపాలెం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
దిశ,అద్దంకి: పంగులూరు మండలం నార్నేవారిపాలెం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పంగులూరు నుంచి మార్టూరు వెళ్తున్న ఆటోను వెనక నుండి వస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ క్రమంలో ఆటో ముందు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టడంతో స్కూటీ మీద ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బొమ్మనంపాడు కు చెందిన కస్తూరి నాగేశ్వరరావుగా స్థానికులు గుర్తించారు. ఆటోలో ఉన్న నలుగురు వ్యక్తులకు స్వల్ప గాయాలు కావడంతో వారిని మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైవే పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.