ఉపాధి లేక ఉసురు తీసుకున్న దినసరి కూలీ

ఉపాధి లేక మనస్థాపానికి గురై ఓ దినసరి కూలీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తంగళ్లపల్లి మండలం తాడురు గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది.

Update: 2025-01-05 09:44 GMT

దిశ, తంగళ్లపల్లి : ఉపాధి లేక మనస్థాపానికి గురై ఓ దినసరి కూలీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తంగళ్లపల్లి మండలం తాడురు గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. తాడూరు గ్రామ పంచాయతీ వద్ద టవర్ కు ఉరి వేసుకుని కొమురవెల్లి శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దినసరి కూలీగా పని చేసే శ్రీనివాస్ గౌడ్ గత కొంత కాలంగా పని లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు.

    కుటుంబాన్ని పోషించుకోవడం భారం కావడంతో తీవ్ర మనోవేదనకు గురైన శ్రీనివాస్ గౌడ్ తాడూరు గ్రామ పంచాయతీ వద్ద ఉన్న టవర్ పైకి ఎక్కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య లత హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు, స్థానికుల సహాయంతో శ్రీనివాస్ గౌడ్ మృతదేహాన్ని కిందకు దింపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  


Similar News