కడుపు నొప్పి భరించలేక చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య

దిలావర్పూర్ మండల కేంద్రంలో కడుపునొప్పి భరించలేక ఆసుపత్రిలో చూపించుకునే ఆర్థిక స్థోమత లేక జీవితంపై విరక్తి చెంది ఆడెపు రాజు (37)అనే వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు

Update: 2024-10-06 14:48 GMT

దిశ, దిలావర్పూర్ : దిలావర్పూర్ మండల కేంద్రంలో కడుపునొప్పి భరించలేక ఆసుపత్రిలో చూపించుకునే ఆర్థిక స్థోమత లేక జీవితంపై విరక్తి చెంది ఆడెపు రాజు (37)అనే వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఇంటి నుంచి బయలుదేరినటువంటి ఆడెపు రాజు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొంతకాలం నుంచి రాజు కడుపు నొప్పితో బాధపడుతుండేవాడని, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని బాధపడేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు.చెరువు వైపు వెళ్లిన వ్యక్తులు తేలియాడుతున్న శవాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి శవాన్ని బయటకు తీయడంతో ఆడేపు రాజుగా గుర్తించారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమని ఎస్సై సందీప్ తెలిపారు.


Similar News