కుల బహిష్కరణ కేసులో 8 మందికి జైలు శిక్ష

భూతగాదా విషయంలో కుల బహిష్కరణ చేసిన 8 మంది కుల పెద్దలకు నెల రోజుల పాటు జైలు శిక్ష, 5000 చొప్పున జరిమానా విధిస్తూ స్పెషల్ పీసీఆర్ కోర్ట్ ఆదిలాబాద్ జడ్జి టి.దుర్గా రాణి బుధవారం తీర్పు ఇచ్చారు.

Update: 2024-12-18 13:57 GMT

దిశ, వాంకిడి : భూతగాదా విషయంలో కుల బహిష్కరణ చేసిన 8 మంది కుల పెద్దలకు నెల రోజుల పాటు జైలు శిక్ష, 5000 చొప్పున జరిమానా విధిస్తూ స్పెషల్ పీసీఆర్ కోర్ట్ ఆదిలాబాద్ జడ్జి టి.దుర్గా రాణి బుధవారం తీర్పు ఇచ్చారు. ఎస్సై ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం వాంకిడిలోని రాంనగర్ కు చెందిన నౌగడే ఆత్మరాం కుమారుడు సుభాష్ భూతగాదా విషయంలో వారిని మూడేళ్ల పాటు కుల బహిష్కరణ చేస్తూ కుల పెద్దలు నౌగడే దాదాజీ, నౌగడే బాబురావు, నౌగాడే బాహుజీ, చాప్లె సీతారాం, చౌదరి బిజ్జి, నౌగడే రమేష్, హౌగడే పెంటు, లోనరే నాం దేవ్ పంచులు తీర్మానం చేశారు.

    ఈ విషయమై 08.05.2020న బాధితుడు ఆత్మరాం వాంకిడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా 8 మందిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా నేరం రుజువుకావడంతో నిందితులకు నెలపాటు జైలు శిక్షతో పాటు 5 వేల రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో నిందితులకి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అభినందించారు. 


Similar News