మీ పని నచ్చింది.. ఇదే స్పూర్తిని కొనసాగిద్దాం

దిశ, కరీంనగర్ : కరోనా వైరస్ నివారణకు, లాక్‌డౌన్ నిబంధనలు పక్కాగా అమలు చేయడంలో కరీంనగర్ పోలీసులు తీసుకుంటున్న చొరవ బాగుందని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి కొనియాడారు. టెక్నాలజీని ఉపయోగిస్తూ కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో లాక్ డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్న తీరు బాగుందని, ఇతర జిల్లాల్లో కూడా ఇదే పద్ధతిని అమలు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. సాంకేతికతను అందిపుచ్చుకుని మిగతా జిల్లాల్లో రోడ్లపై తిరిగే […]

Update: 2020-04-09 03:59 GMT

దిశ, కరీంనగర్ : కరోనా వైరస్ నివారణకు, లాక్‌డౌన్ నిబంధనలు పక్కాగా అమలు చేయడంలో కరీంనగర్ పోలీసులు తీసుకుంటున్న చొరవ బాగుందని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి కొనియాడారు. టెక్నాలజీని ఉపయోగిస్తూ కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో లాక్ డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్న తీరు బాగుందని, ఇతర జిల్లాల్లో కూడా ఇదే పద్ధతిని అమలు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. సాంకేతికతను అందిపుచ్చుకుని మిగతా జిల్లాల్లో రోడ్లపై తిరిగే వారిని, సోషల్ డిస్టెన్స్ పాటించని వారిని, సమూహంగా చేరే వారిని నియంత్రించాలని డీజీపీ ఆదేశించారు. అనంతరం కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులతో సీపీ కమలాసన్ రెడ్డి కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు కొనసాగించిన స్పూర్తినే మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు.కమిషనరేట్ వ్యాప్తంగా తీసుకుంటున్న చర్యలపై డీజీపీ ఊటంకించారని, ఇది మన పనితీరుకు నిదర్శనమని వివరించారు. రానున్న కాలంలో కూడా ఇదే ఒరవడిని కొనసాగిస్తూ మరింత మంచి పేరు తెచ్చుకునే దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని సీపీ కమలాసన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తంచేశారు.

Tags: carona,lockdown, cp kamal hassan reddy, security, drone cam check

Tags:    

Similar News