అన్ని పీహెచ్‌సీలకు కోవిడ్ కిట్లు : కలెక్టర్
దిశ, ఆసిఫాబాద్: కొవిడ్-19 నియంత్రణలో భాగంగా సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గోలేటి క్వారంటైన్ సెంటర్లో 22, సింగరేణి ఐసోలేషన్‌లో 13, వాంకిడి క్వారంటైన్ సెంటర్లో 28, సాంఘిక గురుకుల పాఠశాలలో 69, పీహెచ్‌సీ ఆసిఫాబాద్‌లో 22 మంది, మొత్తం 154 మంది మొత్తం కోవిడ్ అనుమానితులు ఉన్నారని తెలిపారు. ఇప్పటివరకు 4142 శాంపిల్స్‌ను గాంధీ ఆసుపత్రికి పంపించగా, అందులో 302 మందికి పాజిటివ్‌గా […]
దిశ, ఆసిఫాబాద్: కొవిడ్-19 నియంత్రణలో భాగంగా సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గోలేటి క్వారంటైన్ సెంటర్లో 22, సింగరేణి ఐసోలేషన్‌లో 13, వాంకిడి క్వారంటైన్ సెంటర్లో 28, సాంఘిక గురుకుల పాఠశాలలో 69, పీహెచ్‌సీ ఆసిఫాబాద్‌లో 22 మంది, మొత్తం 154 మంది మొత్తం కోవిడ్ అనుమానితులు ఉన్నారని తెలిపారు.
ఇప్పటివరకు 4142 శాంపిల్స్‌ను గాంధీ ఆసుపత్రికి పంపించగా, అందులో 302 మందికి పాజిటివ్‌గా వచ్చిందని నిర్ధారించారు. 3777 మందికి నెగటివ్ రాగా, మరో 63 మంది రిజల్ట్స్ రావాల్సి ఉందని అన్నారు. కోవిడ్ కిట్లను అన్ని పీహెచ్‌సీలకు పంపిణీ చేయాలని, క్వారంటైన్ సెంటర్లలో శానిటేషన్ సిబ్బంది లేనిచోట సిబ్బందిని నియమించాలని జిల్లా వైద్య అధికారిని ఆదేశించారు.