నర్సుతో.. తాను పొరబాటు చేశానని ఏడ్చాడు

దిశ, వెబ్ డెస్క్: కరోనాతో యావత్ ప్రపంచమే గజగజ వణికిపోతుంటే.. అతను మాత్రం కరోనాను చాలా ఈజీగా తీసుకున్నాడు. కరోనా సోకిన వ్యక్తి ఇచ్చిన పార్టీకి హాజరై చివరకు కరోనా బారిన పడి ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నాడు. అమెరికాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. విషయమేమిటంటే.. కరోనా సోకిన ఓ వ్యక్తి కోవిడ్ -19 పేరిట పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీకి ఇతను హాజరయ్యాడు. అనంతరం అతనికి కూడా కరోనా సోకింది. దీంతో అతను శాన్ ఆంటోనియో […]

Update: 2020-07-13 06:31 GMT

దిశ, వెబ్ డెస్క్: కరోనాతో యావత్ ప్రపంచమే గజగజ వణికిపోతుంటే.. అతను మాత్రం కరోనాను చాలా ఈజీగా తీసుకున్నాడు. కరోనా సోకిన వ్యక్తి ఇచ్చిన పార్టీకి హాజరై చివరకు కరోనా బారిన పడి ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నాడు. అమెరికాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. విషయమేమిటంటే.. కరోనా సోకిన ఓ వ్యక్తి కోవిడ్ -19 పేరిట పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీకి ఇతను హాజరయ్యాడు. అనంతరం అతనికి కూడా కరోనా సోకింది. దీంతో అతను శాన్ ఆంటోనియో అనే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఆస్పత్రిలోని నర్సుతో.. తాను తమ ఫ్రెండ్ ఇచ్చిన కరోనా పార్టీకి హాజరై పొరపాటు చేశానంటూ ఏడ్చేశాడంట.

Tags:    

Similar News