మరో వివాదంలో జగిత్యాల మున్సిపల్.. జిల్లా కలెకర్ట్‌కు కౌన్సిలర్ ఫిర్యాదు

దిశ, జగిత్యాల : జగిత్యాల మున్సిపల్‌లో జరిగే అవకతవకలపై జిల్లా కలెక్టర్‌కు 35వ వార్డు కౌన్సిలర్ అనుమల్ల జయశ్రీ లేఖ రాశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొవిడ్ సమయంలో మృతదేహాల అంత్యక్రియలకు సంబంధించి కౌన్సిల్ తీర్మానం చేసిందని, కేవలం నలుగురు ఔట్ సోర్సింగ్ కార్మికులు అంత్యక్రియలు నిర్వహిస్తే ఒక బాడీకి రూ.3,000 చొప్పున చెల్లించేందుకు సమావేశంలో ఆమోదం తెల్పిందన్నారు. కానీ, ఇప్పుడు ఎనిమిది మందికి డబ్బులు చెల్లించినట్టు బిల్లులలో పేర్కొన్నారని ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ విషయమై […]

Update: 2021-09-23 11:01 GMT

దిశ, జగిత్యాల : జగిత్యాల మున్సిపల్‌లో జరిగే అవకతవకలపై జిల్లా కలెక్టర్‌కు 35వ వార్డు కౌన్సిలర్ అనుమల్ల జయశ్రీ లేఖ రాశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొవిడ్ సమయంలో మృతదేహాల అంత్యక్రియలకు సంబంధించి కౌన్సిల్ తీర్మానం చేసిందని, కేవలం నలుగురు ఔట్ సోర్సింగ్ కార్మికులు అంత్యక్రియలు నిర్వహిస్తే ఒక బాడీకి రూ.3,000 చొప్పున చెల్లించేందుకు సమావేశంలో ఆమోదం తెల్పిందన్నారు. కానీ, ఇప్పుడు ఎనిమిది మందికి డబ్బులు చెల్లించినట్టు బిల్లులలో పేర్కొన్నారని ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ విషయమై జవాన్ మరియు శానిటరీ ఇన్‌స్పెక్టర్లలపై
పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కోరారు.

అలాగే, శానిటేషన్ వాహనాల్లో డీజిల్ బిల్లుల కోసం గత ఫిబ్రవరి నెలలో అదనంగా రూ. 2 లక్షలు ఖర్చు చేసినట్టు చూపారన్నారు. సమావేశంలో అడిగితే అధికారులు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పారు.దీనిని బట్టి జగిత్యాల మునిసిపాలిటీలో ఎంత మేర అవినీతి జరిగిందో తెలుస్తుందన్నారు. దీనిపై కూడా పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కోరారు. హరితహారంలో లేబర్ చార్జీల కింద లక్షలలో ఖర్చు చేసినట్టు చూపారని, వీటి వివరాలు కూడా అధికారులు చెప్పలేకపోతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బక్రీద్ పండుగ ఏర్పాట్ల కొరకు రూ. 4 లక్షలు కేటాయించారని కానీ, కొవిడ్ సమయంలో ప్రభుత్వం కేవలం ఐదుగురికి మాత్రమే మసీదులో నమాజ్ చేసుకోవడానికి ఆదేశాలు జారీ చేసిందని, అయినా లక్షలలో బిల్లులు పెట్టి దోచుకుంటున్నారన్నారు. ఈ అక్రమాలపై విచారణ జరిపి ఎటువంటి బిల్లు చెల్లింపులు చేయవద్దని జిల్లా కలెక్టర్ రవిని కోరారు.

Tags:    

Similar News