జమ్మికుంటలో రికార్డు స్థాయిలో పత్తి ధర
దిశ, జమ్మికుంట: జమ్మికుంట పత్తి మార్కెట్ లో రికార్డు స్థాయిలో పత్తి ధర పలికింది. గత కొద్ది నెలలుగా నిలకడగా ఉన్న పత్తి ధర మంగళవారం అమాంతం పైకి ఎగిసి పడింది. 40 రోజుల క్రితం పత్తి ధర క్వింటాల్ కు రూ.8610 లు పలుకగా, ఈ సీజన్ లో ఆ ధరను బ్రేక్ చేసి రూ.8715 పలికింది. కాగా విడి పత్తి 76 వాహనాల్లో రాగా, గరిష్ట ధర రూ.8715, కామన్ ధర రూ. 8500 […]
దిశ, జమ్మికుంట: జమ్మికుంట పత్తి మార్కెట్ లో రికార్డు స్థాయిలో పత్తి ధర పలికింది. గత కొద్ది నెలలుగా నిలకడగా ఉన్న పత్తి ధర మంగళవారం అమాంతం పైకి ఎగిసి పడింది. 40 రోజుల క్రితం పత్తి ధర క్వింటాల్ కు రూ.8610 లు పలుకగా, ఈ సీజన్ లో ఆ ధరను బ్రేక్ చేసి రూ.8715 పలికింది. కాగా విడి పత్తి 76 వాహనాల్లో రాగా, గరిష్ట ధర రూ.8715, కామన్ ధర రూ. 8500 లు, కనీస ధర రూ.7500 లు పలికింది. అదేవిధంగా బస్తాల్లో 38 క్వింటాళ్లు రాగా, గరిష్ట ధర రూ.8300 లు, కామన్ ధర రూ.8000 లు, కనిష్ట ధర రూ. 5000 లు పలికింది. ఈ సీజన్ లో పత్తి ధర అత్యధికంగా పలకడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.