కరోనాపై ఆదిలాబాద్ పోలీసుల షార్ట్‌ఫిల్మ్

దిశ, ఆదిలాబాద్: లాక్‌డౌన్ నిబంధనలు పాటించండి.. కరోనా వైరస్‌ను అంతం చేయండి అనే నినాదంతో సోన్ సీఐ జీవన్‌రెడ్డి నేతృత్వంలోని కళా బృందం రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌ సీడీలను సోమవారం నిర్మల్‌లో ఎస్పీ శశిధర్ రాజు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కంటికి కనిపించకుండా ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ పట్ల కఠినంగా వ్యవహంచాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ లఘు చిత్రం ఎంతగానో ఉపయోగపడుతుందని, తక్కువ సమయంలో మంచి సందేశం ఇచ్చేలా షార్ట్ […]

Update: 2020-05-04 09:24 GMT

దిశ, ఆదిలాబాద్: లాక్‌డౌన్ నిబంధనలు పాటించండి.. కరోనా వైరస్‌ను అంతం చేయండి అనే నినాదంతో సోన్ సీఐ జీవన్‌రెడ్డి నేతృత్వంలోని కళా బృందం రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌ సీడీలను సోమవారం నిర్మల్‌లో ఎస్పీ శశిధర్ రాజు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కంటికి కనిపించకుండా ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ పట్ల కఠినంగా వ్యవహంచాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ లఘు చిత్రం ఎంతగానో ఉపయోగపడుతుందని, తక్కువ సమయంలో మంచి సందేశం ఇచ్చేలా షార్ట్ ఫిల్మ్ రూపొందించిన సోన్ సీఐ జీవన్‌రెడ్డిని అభినందించారు. పోలీసుల సహకారంతో ఇటీవల పాత్రికేయుల బృందం కూడా కరోనాపై షార్ట్ ఫిల్మ్ రూపొందించిందని, ప్రజలను చైతన్య పరిచేందుకు ఎవరికి తోచిన రీతిలో వారు అవగాహన కార్యక్రమాలు చేపడుతుండటం హర్షణీయమన్నారు. లాక్‌డౌన్‌కు జిల్లా ప్రజలు సహకరించడం వల్లనే 14 రోజుల నుంచి ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, షార్ట్ ఫిల్మ్ రూపకర్త సొన్ సీఐ జీవన్ రెడ్డి పాల్గొన్నారు.

tags: corona short film, release by sp shashidhar raju, lockdown restrictions

Tags:    

Similar News