తురకం చెరువుకు పక్షి ప్రేమికులు
తురకం, యంగన్న చెరువులకు పక్షి ప్రేమికులు చేరుకున్నారు.
దిశ, మామడ : తురకం, యంగన్న చెరువులకు పక్షి ప్రేమికులు చేరుకున్నారు. నిర్మల్ జిల్లా మామడ మండలంలోని దిమధుర్తి అటవీ రేంజ్ పరిధిలోని నల్దుర్తి గ్రామ సమీపంలో గల తురకం చెరువు అలాగే పొన్కల్ గ్రామంలోని యంగన్న చెరువులను తిలకించేందుకు పక్షి ప్రేమికులు విచ్చేశారు. నవంబర్, డిసెంబర్ నెలలో ఇతర రాష్ట్రాల నుంచి వివిధ రకాల పక్షులు ఈ చెరువుల వద్దకు వలసలు రావడంతో పర్యాటకుల సందడి నెలకొంటుంది. ఈ చెరువులు నిజాం కాలంలో 1913 సంవత్సరంలో నిర్మించారు.
వీటిని తిలకించడానికి శనివారం హైదరాబాద్ నుంచి అటవీ అధికారులు, ఐటీ కోస్ బృందం సభ్యులు వచ్చారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో వీరికి అన్ని ఏర్పాట్లు చేశారు. వీరు రాత్రి ఈ చెరువు వద్ద బస చేసి ఆదివారం చెరువులను తిలకించి వీటి పుట్టుపూర్వోత్తరాలను, పక్షుల వివరాలను తెలుసుకోనున్నారు. అనంతరం ఇక్కడి నుంచి కవ్వాల్ లోని అభయారణ్యం తిలకించడానికి వెళ్లనున్నారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఎలిసన్ మెరిసన్, సీఎఫ్ శర్వానంద్, డీఎఫ్ఓ , ఎఫ్ఆర్ఓ, 40 మంది ఐటీ కోస్ బృందం సభ్యులు వచ్చిన వారిలో ఉన్నారు.