తెలంగాణలో కరోనా.. హైరానా.. 

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రోజురోజుకూ కొవిడ్ కేసులు పెరిగిపోతుండడంతో అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. సెకండ్ వేవ్ సర్వత్రా గుబులురేపుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో వారం రోజుల క్రితం 47 ఉన్న కేసులు గడిచిన 24 గంటల్లోనే 138కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజులోనే 493 కేసులు నమోదుకాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 3,684కు చేరింది. ఒకరోజులో నలుగురు మృతిచెందగా, ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 1,680కు చేరింది. ఆస్పత్రుల్లో వైద్యచికిత్స పొందుతున్నవారి సంఖ్య కూడా క్రమేపీ పెరుగుతోంది. వారం […]

Update: 2021-03-25 11:37 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రోజురోజుకూ కొవిడ్ కేసులు పెరిగిపోతుండడంతో అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. సెకండ్ వేవ్ సర్వత్రా గుబులురేపుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో వారం రోజుల క్రితం 47 ఉన్న కేసులు గడిచిన 24 గంటల్లోనే 138కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజులోనే 493 కేసులు నమోదుకాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 3,684కు చేరింది. ఒకరోజులో నలుగురు మృతిచెందగా, ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 1,680కు చేరింది.

ఆస్పత్రుల్లో వైద్యచికిత్స పొందుతున్నవారి సంఖ్య కూడా క్రమేపీ పెరుగుతోంది. వారం రోజుల క్రితం.. ఒక్క రోజు లెక్కిస్తే రెండొందల కరోనా కేసులు నమోదుకాగా, తాజాగా ఒకే రోజు 493 కేసులు నిర్ధారణ అయ్యాయి. మేడ్చల్ మల్కాజ్ గిరిలో ప్రస్తతం 42 కేసులు నమోదుకాగా, వారంరోజుల క్రితం 20 కేసులు మాత్రమే ఉన్నాయి.

రంగారెడ్డిలో 35, నిజామాబాద్ లో 24 కేసులు అత్యధికంగా నిర్ధారణ అయ్యాయి. నారాయణపేట జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా గురువారం 56,464 మందికి టెస్టులు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 33 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా కోసం ప్రత్యేకంగా మొత్తం 8,419 బెడ్లు అందుబాటులో ఉండగా, 589 మంది చికిత్సపొందుతున్నారు.

ఆక్సిజన్ బెడ్లు 5,163 ఉండగా, వీటిలో 268 మంది వైద్యం తీసుకుంటున్నారు. ఐసీయూ బెడ్లు 1,689 ఉండగా 164 మంది వైద్యచికిత్స పొందుతున్నారు. 215 ప్రైవేట్ ఆస్పత్రుల్లో 7,605 బెడ్లు ఉండగా, 1,479 మంది చికిత్స పొందుతున్నారు. ఆక్సిజన్ బెడ్లు 3,105 ఉండగా, 773 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో 2,516 బెడ్లు ఏర్పాటు చేయగా 415 మంది ట్రీట్ మెంట్ పొందుతున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల కంటే ప్రైవేట్ ఆస్పత్రులను ఎక్కువగా ఎక్కువ మంది ఆశ్రయిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో 589 మంది కరోనా రోగులు చికిత్సలు పొందుతుండగా, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 1,479 మంది చికిత్స తీసుకుంటున్నారు.

 

Tags:    

Similar News