ఢిల్లీకి వెళ్లిన వారిలో 10 మంది వారే..

దిశ, కరీంనగర్: ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన కరీంనగర్ జిల్లా వాసులు 19 మందిలో 10 మంది ఇండోనేషియన్ వారే ఉన్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా శుక్రవారం కార్పొరేషన్‌లో ఏర్పాటైన కొవిడ్ ప్రివెంటర్, యాంటీ వైరల్ బాక్స్ టెస్ట్ రన్‌ను ఆయన పరిశీలించారు. అలాగే పారిశుధ్య కార్మికులకు గ్లౌజులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ ఇండోనేషియన్ల విషయం వెలుగులోకి రాగానే కరోనా నివారణకు అధికార యంత్రాంగం […]

Update: 2020-04-03 07:57 GMT

దిశ, కరీంనగర్: ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన కరీంనగర్ జిల్లా వాసులు 19 మందిలో 10 మంది ఇండోనేషియన్ వారే ఉన్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా శుక్రవారం కార్పొరేషన్‌లో ఏర్పాటైన కొవిడ్ ప్రివెంటర్, యాంటీ వైరల్ బాక్స్ టెస్ట్ రన్‌ను ఆయన పరిశీలించారు. అలాగే పారిశుధ్య కార్మికులకు గ్లౌజులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ ఇండోనేషియన్ల విషయం వెలుగులోకి రాగానే కరోనా నివారణకు అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యిందన్నారు.అందువల్లే జిల్లా పెద్ద ముప్పు నుంచి బయట పడిందన్నారు.సీఎం కేసీఆర్ ఆదేశాలతో కరీంనగర్‌లో వైద్య శాఖ సిబ్బందితో పరీక్షలు చేయించామని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎంత చేయాలో అంతా చేస్తోందని, ఇప్పుడు కావాల్సింది ప్రజల సహకారమేనన్నారు. ప్రస్తుత పరిస్థితిలో కరోనా ఎప్పుడు ఎలా సోకేది తెలియదన్నారు.లాక్ డౌన్ పూర్తయ్యేవరకు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని గంగుల సూచించారు.

నగరంలో పారిశుధ్యం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న మున్సిపల్ వర్కర్స్‌కు మేయర్ యాదగిరి సునీల్ రావు, రూ.1000 చొప్పున కార్మికులకు సాయం అందజేశారు.

Tags : indonesians, corona, markaz, lockdown, 10 out of 19 indonesians

Tags:    

Similar News