కన్నేపల్లి‌లో కార్డన్ సెర్చ్.. ‘మావోలకు ఆశ్రయం ఇస్తే అంతే సంగతులు’

దిశ, మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కన్నెపల్లి గ్రామంలో మహాదేవపూర్ సీఐ కిరణ్ ఆధ్వర్యంలో శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాళేశ్వరం పీఎస్ఐ ప్రసన్న కుమార్, సివిల్, సీఆర్పీఎఫ్ పార్టీ బలగాల‌తో కలిసి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మావోల ప్రభావిత గ్రామాల్లో నిత్యం వాహన తనిఖీలు, కార్డన్ సెర్చ్‌‌లు నిర్వహిస్తున్నారు. అనుమానిత వ్యక్తులు గ్రామాల్లో కనిపించినా, సంచరించినా పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని అన్నారు. […]

Update: 2021-08-20 23:49 GMT

దిశ, మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కన్నెపల్లి గ్రామంలో మహాదేవపూర్ సీఐ కిరణ్ ఆధ్వర్యంలో శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాళేశ్వరం పీఎస్ఐ ప్రసన్న కుమార్, సివిల్, సీఆర్పీఎఫ్ పార్టీ బలగాల‌తో కలిసి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మావోల ప్రభావిత గ్రామాల్లో నిత్యం వాహన తనిఖీలు, కార్డన్ సెర్చ్‌‌లు నిర్వహిస్తున్నారు. అనుమానిత వ్యక్తులు గ్రామాల్లో కనిపించినా, సంచరించినా పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని అన్నారు.

మావోయిస్ట్ సభ్యులకు ఆశ్రయం కల్పించినా, సహాయం చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా సన్మార్గంలో నడవాలని, నిర్ణిత లక్ష్యాలను ఎంచుకొని వాటి దిశగా వెళ్లలాని సూచించారు. సీసీ కెమెరాల గురించి అవగాహన కల్పించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా 100కు ఫోన్ చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం స్టాఫ్ సెలక్షన్ కమిటీ పారా మిలిటరీ‌లో కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తున్నందున ఆసక్తి ఉన్నవారు పోలీస్ స్టేషన్‌కు వస్తే సరైన గైడెన్స్ ఇస్తామని తెలిపారు.

Tags:    

Similar News