ఫలితాల గందరగోళంపై కన్వీనర్ వివరణ..
దిశ, వెబ్‌డెస్క్ : ఎంసెట్ ఫలితాల వెల్లడిలో ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోలేదని కన్వీనర్ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్లు సరిగా వేయకపోవడం, మార్క్స్ మెమోలు సబ్మిట్ చేయకపోవడం వల్లే ఇలా జరిగిందని కన్వీనర్ వివరణ ఇచ్చారు. విద్యార్థులు తమ మార్కుల మెమోలు మళ్లీ అందజేస్తారో వారికి తిరిగి ర్యాంకులు కేటాయిస్తున్నట్లు వివరించారు. ర్యాంకుల కేటాయింపుల్లో ప్రతి ఏడాది అనుసరించే విధానాన్నే ఈసారి కూడా అమలు చేశామని, అందువల్ల తప్పులు దొర్లే అవకాశం లేదన్నారు. […]
దిశ, వెబ్‌డెస్క్ : ఎంసెట్ ఫలితాల వెల్లడిలో ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోలేదని కన్వీనర్ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్లు సరిగా వేయకపోవడం, మార్క్స్ మెమోలు సబ్మిట్ చేయకపోవడం వల్లే ఇలా జరిగిందని కన్వీనర్ వివరణ ఇచ్చారు.
విద్యార్థులు తమ మార్కుల మెమోలు మళ్లీ అందజేస్తారో వారికి తిరిగి ర్యాంకులు కేటాయిస్తున్నట్లు వివరించారు. ర్యాంకుల కేటాయింపుల్లో ప్రతి ఏడాది అనుసరించే విధానాన్నే ఈసారి కూడా అమలు చేశామని, అందువల్ల తప్పులు దొర్లే అవకాశం లేదన్నారు. కావున, విద్యార్థులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎంసెట్ కన్వీనర్ ఫ్రొఫెసర్ గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.