రామగుండం కార్పొరేషన్‌లో బడా కాంట్రాక్టర్ బాగోతాలు
దిశ,గోదావరిఖని : ఒకప్పుడు చిన్న చితక పనులు చేసే సాధారణ వ్యక్తి నేడు బడా కాంట్రాక్టర్‌గా ఎదిగి రామగుండం కార్పొరేషన్‌ను తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. చేసిన చేయకపోయినా తాను కోరుకుంటున్నట్లు చేయని పనులకు కూడా చేసినట్లు బిల్లులను సృష్టించి కార్పొరేషన్ నుండి లక్షల రూపాయల నిధులు విడుదల చేయించుకునే ఘనత సదరు కాంట్రాక్టర్‌కే సాధ్యం అవుతుంది అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా రామగుండం కార్పొరేషన్‌ను బడా కాంట్రాక్టర్ తన చెప్పుచేతల్లో పెట్టుకున్నాడు. ఏ అధికారి […]
దిశ,గోదావరిఖని : ఒకప్పుడు చిన్న చితక పనులు చేసే సాధారణ వ్యక్తి నేడు బడా కాంట్రాక్టర్‌గా ఎదిగి రామగుండం కార్పొరేషన్‌ను తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. చేసిన చేయకపోయినా తాను కోరుకుంటున్నట్లు చేయని పనులకు కూడా చేసినట్లు బిల్లులను సృష్టించి కార్పొరేషన్ నుండి లక్షల రూపాయల నిధులు విడుదల చేయించుకునే ఘనత సదరు కాంట్రాక్టర్‌కే సాధ్యం అవుతుంది అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా రామగుండం కార్పొరేషన్‌ను బడా కాంట్రాక్టర్ తన చెప్పుచేతల్లో పెట్టుకున్నాడు. ఏ అధికారి వచ్చిన ఏ నాయకులు వచ్చినా తనకు అనుకూలంగా మార్చుకోవడంలో తనకు తానే సాటి అని కార్పొరేషన్‌లో వినిపిస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో సదరు కాంట్రాక్టర్ చేసిన పనులపై వరుస కథనాలు వచ్చిన నేపథ్యంలో ఈ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ముడుపులతో బుజ్జగింపులకు దిగాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో సదరు కాంట్రాక్టర్ చేసిన కొన్ని పనులకు మున్సిపల్ అధికారి నిధులు మంజూరు చేయకపోవడంతో ఈ వివాదం ఏకంగా ఓ నాయకుడి వద్దకు చేరింది. దీంతో సదరు మున్సిపల్ అధికారులకు ఆదేశాలను జారీ చేశారు.
మనోడే బిల్లులు మంజూరు చేయండి అంటూ తెలపడంతో అడ్డూ అదుపు లేకుండా అక్రమాలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో సదరు కాంట్రాక్టర్ తన ఇంటి సమీపంలో రోడ్డు వేసే క్రమంలో స్థానికంగా తన వాళ్లకు సంబంధించినవి కాకుండా తనకు నచ్చినట్టు మున్సిపల్ నిబంధనలను తుంగలో తొక్కి రోడ్లు వేసినట్లు తెలుస్తోంది. ఈ రోడ్లు వేసే క్రమంలో స్థానికంగా ఉన్న ఓ వ్యక్తికి సంబంధించిన స్థలం కొంత పోవడంతో ఇదేంటని ప్రశ్నించినందుకు నీ దిక్కున్న చోట చెప్పుకో అని బెదిరించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఏళ్ల తరబడి రామగుండం కార్పోరేషన్‌లో కాంట్రాక్టర్ల పేరిట పలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వస్తున్నా చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం వెనుకడుగు వేస్తోందని పలువురు చర్చించుకుంటున్నారు. నాడు బిల్లులు మంజూరు చేయని అధికారే నేడు బిల్లులు మంజూరు చేయడం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సదరు కాంట్రాక్టర్ అవినీతిపై ఎన్నో ఫిర్యాదులు వచ్చినా ఇప్పటివరకు స్పందించిన దాఖలాలే లేవు. ఈ మధ్యకాలంలో సదరు కాంట్రాక్టర్ వేసిన రోడ్డులో అవినీతి అక్రమాలకు పాల్పడటమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా తన ఇష్టం వచ్చినట్లు రోడ్డు వేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారులు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.