ఐదు నెలలుగా.. వాళ్లకు జీతాలు లేవట

దిశ, సిరిసిల్ల: ఐదు నెలలుగా జీతాలు అందడం లేదని జిల్లా కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, థర్డ్ పార్టీ ఉద్యోగులు మంగళవారం విధులు బహిష్కరించి ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వేతనాల పెంపు, ఉద్యోగాల క్రమబద్ధీకరణ సహా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఆస్పత్రి సిబ్బంది ధర్నా నిర్వహించారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్నప్పటికీ ప్రభుత్వం తమను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమకు ఉద్యోగ భద్రత […]

Update: 2020-07-14 05:55 GMT

దిశ, సిరిసిల్ల: ఐదు నెలలుగా జీతాలు అందడం లేదని జిల్లా కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, థర్డ్ పార్టీ ఉద్యోగులు మంగళవారం విధులు బహిష్కరించి ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వేతనాల పెంపు, ఉద్యోగాల క్రమబద్ధీకరణ సహా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఆస్పత్రి సిబ్బంది ధర్నా నిర్వహించారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్నప్పటికీ ప్రభుత్వం తమను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని భావించామని ఇప్పటికీ ప్రభుత్వం తమని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని జీతాలతో కుటుంబ భారం కష్టంగా మారిపోతుందని కాబట్టి వెంటనే జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో తక్కువ సిబ్బంది ఉన్నా రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందిస్తున్నామని ఇప్పటికైనా ప్రభుత్వం తమ సేవలను గుర్తించి తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Tags:    

Similar News