హుజురాబాద్‌లో కాంగ్రెస్ టీం రెడీ
దిశ, తెలంగాణ బ్యూరో : త్వరలో హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగుతోంది. దీనికోసం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన దూకుడును మరింత పెంచారు. రేవంత్‌రెడ్డికి ఈ ఉప ఎన్నిక కీలకం కానుంది. ఇక్కడి ఫలితాలు హస్తం నేతల్లో జోష్ పెంచడమే కాకుండా… ఆయా పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలు, పార్టీని వీడిన నేతలు తిరిగి వచ్చేందుకు మార్గం కానుంది. గెలుపోటములు ఎలా ఉన్నా… హుజురాబాద్‌లో ఓటు బ్యాంకును నిరూపించుకోవడం ఇప్పుడు […]
దిశ, తెలంగాణ బ్యూరో : త్వరలో హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగుతోంది. దీనికోసం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన దూకుడును మరింత పెంచారు. రేవంత్‌రెడ్డికి ఈ ఉప ఎన్నిక కీలకం కానుంది. ఇక్కడి ఫలితాలు హస్తం నేతల్లో జోష్ పెంచడమే కాకుండా… ఆయా పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలు, పార్టీని వీడిన నేతలు తిరిగి వచ్చేందుకు మార్గం కానుంది. గెలుపోటములు ఎలా ఉన్నా… హుజురాబాద్‌లో ఓటు బ్యాంకును నిరూపించుకోవడం ఇప్పుడు రేవంత్‌పై ఉన్న అతిపెద్ద టాస్క్.
ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఉప ఎన్నికల కోసం ఇన్‌చార్జ్‌లను టీపీసీసీ ప్రకటించింది. హుజురాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జ్‌గా దామోదర రాజనర్సింహకు బాధ్యతలను అప్పగించారు. ఇప్పటికే ఆయనకు ఈ బాధ్యతలను ఇస్తామని, అక్కడ అభ్యర్థిని ఎంపిక చేసే అంశాన్ని కూడా ఆయనపైనే వేశారు. టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డితో సమన్వయం చేసుకుంటూ అక్కడి పరిణామాలపై ఫోకస్చేయాల్సి ఉంటోంది.
హుజురాబాద్‌కు సమన్వయకర్తలుగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌లు వ్యవహరించనున్నారు. ఇక హుజురాబాద్సెగ్మెంట్లో రేవంత్‌రెడ్డి త్వరలోనే పర్యటిస్తారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో ముందుగా హుజురాబాద్ప్రాంతంలో పర్యటించే అవకాశాలున్నాయి.
కాంగ్రెస్ పార్టీ నుంచి వీణవంక మండం ఇంచార్జీలుగా ఆది శ్రీనివాస్, సింగీతం శ్రీనివాస్, జమ్మికుంట మండలానికి మాజీ ఎమ్మెల్యే విజయ రమణరావు, రాజ్ ఠాగూర్ మక్కాన్‌సింగ్, హుజురాబాద్ మండలానికి టి. నర్సారెడ్డి, లక్షణ్ కుమార్, హుజురాబాద్ టౌన్‌కు బొమ్మ శ్రీరాం చక్రవర్తి, జువ్వాడి నర్సింగారావు, ఇల్లంతకుంట మండలానికి నాయిని రాజేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కమలాపూర్ మండలానికి కొండా సురేఖ, దొమ్మటి సాంబయ్యలను ఇంచార్జీలుగా నియమించారు. ఇక కంట్రోల్ రూమ్ సమన్వయ కర్తగా కవ్వంపల్లి సత్యనారాయణ, హుజురాబాద్ ఉప ఎన్నికలపై సమాచారం కోసం దొంతి గోపిని నియమించినట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు.